జీఎస్టీ బకాయిలు చెల్లిస్తాం: కేంద్రం

111
gst

త్వరలో రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిలను చెల్లిస్తామని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసిన కేంద్రం…వసూళ్లలో భారీ లోటు ఉన్నప్పటికి బకాయిలు చెల్లిస్తామని వెల్లడించింది.

జీఎస్టీ బ‌కాయిలను పూడ్చుకోవ‌డం కోసం రాష్ట్రాల‌కు ఇటీవ‌ల కేంద్రం ఇచ్చిన రెండు ప్ర‌త్యామ్నాయాల‌పై సందేహాలను నివృత్తి చేయ‌డానికి కేంద్ర ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి, ఎక్స్‌పెండీచ‌ర్ కార్య‌ద‌ర్శి సెప్టెంబ‌ర్ 1న ఆన్‌లైన్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. దీనిలో రాష్ట్రాలు లేవనెత్తే సందేహాలకు సమాధానం ఇవ్వనున్నారు.

ఒక ఆర్థిక ఏడాదిలో రూ.3 ల‌క్ష‌ల కోట్లు వ‌సూలు కావాల్సి ఉండ‌గా ఈ ఏడాది అది రూ.65 వేల కోట్ల‌కు మించే అవ‌కాశం లేద‌ని ఆర్థిక‌శాఖ‌ అంచ‌నా వేసింది. కరోనా కారణంగా రూ.2.35 ల‌క్ష‌ల కోట్ల లోటు ఏర్పడిందని కేంద్రం వెల్లడించింది.