విడుదలకు సిద్ధమైన పీపుల్స్‌స్టార్ రైతన్న…

38
narayanamurthi

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘రైతన్న’. ఆదివారం రైతు నాయకుల కోసం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో సినిమాను ప్రదర్శించగా వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోదండ రెడ్డి, సీపిఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, సిపీఎం నాయకులు మధు, టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్, ఎంఎల్సీసి గోరటి వెంకన్న, కవి అందెశ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి, గోవర్ధన్, రైతు సంఘం సాగర్, శ్రీమతి పద్మ తదితరులు ఉన్నారు.

భారత రైతాంగం ఏడు నెలల నుంచి వ్యవసాయ, విద్యుత్ చట్టాలపై పోరాడుతోందని, ఎంతో ధైర్యం చేసి నారాయణ మూర్తి ఈ సినిమా తీసినందుకు అభినందనలు తెలుపుతున్నానని వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పారు. అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే కార్యక్రమం కేంద్రం చేస్తోందని సీపీఐ చాడా వెంకటరెడ్డి విమర్శించగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని గద్దర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ…ఇందులోని పాటలను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, వంగపండు ప్రసాదరావు పాడారు. వారికి నా నివాళి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి అని చెబుతూ రైతన్న సినిమా తీశానని వెల్లడించారు.