హాయత్ నగర్‌లో ఆర్ నారాయణ మూర్తి ఆట,పాట

30
rnr

తెలంగాణ ప్రజా నాట్యమండలి రంగారెడ్డి జిల్లా మూడవ మహాసభ ల బహిరంగ సభ హాయత్ నగర్ లోని రావి నారాయణరెడ్డి కాలనీలో గనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిధులు గా సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి,సిపిఐ నాయకులు చాడ వెంకట్ రెడ్డి మరియు పల్లా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

దేశము లో ఉన్న కమ్యూనిస్టు పార్టీ లు అన్ని పునరికృతం అయితేనె పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని కేంద్రం లో ఉన్న నరేంద్రమోదీ అంటున్నటువంటి ఆజాద్ కి స్వత0త్ర్ దేశంలో ఉన్న 90 శాతం ప్రజలకి రాలేదని కేవలం 10 శాతం ఉన్న బడా కార్పొరేట్ శక్తులకు మాత్రమే వచ్చిందన్నారు సినీ నటుడు నారాయణ మూర్తి, దేశం లో ఉన్న అన్ని సంస్థలని ప్రైవేటు పరం చేస్తున్న మోడీ రాజ్యాంగ హక్కులని ఉల్లంగిస్తున్నారన్నారు.

75 వ ఆజాద్ అమృత మహోత్సవ వేడుకల్ని ప్రధాని మోడీ జరుపుతున్నారని ఇప్పటికి 60 శాతం పేదలకు స్వతంత్ర ఫలాలు అందలేదని ఇంకా పేదరికం లో ఉన్నందుకు సిగ్గు పడాలని,అక్కడ మీరు గనంగా ఉత్సవాలు చేసుకుటుంటే ఇక్కడ పెదవాళ్ళు ఆకలితో ఉత్సవాలు చేసుకుంటున్నారని సిపిఐ నాయకులు చాడ మండిపడ్డారు.