మీరు దమ్ ఛాయ్ తాగుతారా..?

102
kajal

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కూడా ఫుల్‌ బిజీగా మారింది. వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్ను కూడా పక్కాగా ప్లాన్‌ చేస్తుంది. గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తోంది. దక్షిణాదిన దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించిన కాజల్‌ అటు వైవాహిక బంధం, ఇటు సినిమాలను సమ స్ధాయిలో మేనెజ్ చేస్తూ ఇల్లు చక్కదిద్దుకుంటోంది.

ప్రస్తుతం ముంబైలో ఓ విలాసవంతమైన భవనంలో నివసిస్తున్న కాజల్‌ లేటెస్ట్ పిక్స్‌ని షేర్ చేసింది. దమ్ ఛాయ్ తాగుతూ మీరు తాగుతారా అనేలా ఫోటోకు ఫోజులిస్తూ ఫిదా చేసేసింది. కాజల్ ఫోటోలను చూసి నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం కాజల్‌ మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’, కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌-2’లో నటిస్తుంది. వీటితో పాటు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.