ఐటీలో కొత్త ఆవిష్కరణలకు నిజామాబాద్ కేంద్రం కావాలని ఆకాక్షించారు మంత్రి కేటీఆర్. దర్బాలో ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన కేటీఆర్ నాలుగేళ్లలోనే ఐటీ ఎగుమతులు రూ. లక్ష కోట్లకు చేరుకున్నాయని చెప్పారు.
నిజామాబాద్ జిల్లా టెక్రాన్‌పల్లిలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు. గత మూడేళ్లలో నిజామాబాద్‌కు కార్పొరేషన్‌కు రూ. 400 కోట్లు కేటాయించామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇతరత్రా గ్రాంట్లు కలుపుకుంటే మొత్తం రూ. 900 కోట్లు వచ్చాయన్నారు. ఓ వైపు ఉద్యోగాలను భర్తీ చేస్తూనే మరోవైపు అభివృద్ధిలో తెలంగాణను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. టీఎస్‌ఐపాస్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాలు సృష్టించామని తెలిపారు.
ఐటీ ఫలాలు సామాన్యులకు అందాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని చెప్పారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను మారబోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలకు ఐటీని విస్తరిస్తామని చెప్పారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు అందించే మంచి పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.టీఎస్‌పీఎస్సీ ద్వారా 46 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.
విద్యార్థుల్లో సత్తా వెలికితీసేందుకు టాస్క్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్ పట్టణంలో స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు,బస్ టెర్నినల్,ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రిస్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా కళ్లు తెరచి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలన్నారు.