కన్వర్ యాత్రలో గోల్డెన్ బాబా

295
Golden Baba
- Advertisement -

బంగారం అమ్మాయిలు విడదీయలేని సంబంధం. ఎందుకంటే బంగారం అంటే మక్కువ ఉండని అమ్మాయిలు ఉండరు. అయితే అతడో సన్యాసి. కానీ బంగారంపై ప్రీతి ఎక్కువ. ఎంతలా అంటే అతడు బంగారాన్ని ధరించడాన్ని చూసే గోల్డెన్‌ బాబా అనే పేరు తెచ్చుకున్నారు.

తాజాగా చాలకాలం తర్వాత మళ్లీ ఈ బాబా వార్తల్లోకి ఎక్కారు. ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏటా శివ భక్తులు హరిద్వార్‌కు కన్వర్ యాత్ర చేస్తారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు వచ్చారు ఈ గోల్డెన్ బాబా. 25వ సారి కన్వర్ యాత్రలో పాల్గొంటున్న గోల్డెన్ బాబా అసలు పేరు సుదీర్ మక్కర్. ఆయన ధరించిన బంగారం ఎంతో తెలుసా…అక్షరాలా 20 కేజీలు. మార్కెట్లో ఆయన ధరించిన బంగారం కాస్ట్ ఏకంగా ఆరు కోట్ల రూపాయలు.

kanvar yathraబాబా బంగారు ఆభరణాల్లో 21 గొలుసులు, దేవుడి విగ్రహాలతో కూడిన 21 లాకెట్లు, చేతి కడియాలు, బంగారపు జాకెట్‌, తదితర నగలు ఉన్నాయి. 2016లో ఆయన 12కేజీల బంగారం ధరించి యాత్ర చేశారు. గత ఏడాది 14.5కేజీల బంగారంతో యాత్రలో పాల్గొన్నారు.

ఈ సారి యాత్ర కోసం మరో 4 కేజీల బంగారం కొన్నారు. అంతేగాదు పోలీసుల భద్రత,బాబాతో పాటు యాత్రకు వచ్చే వారికోసం ఏకంగా రూ. 1.25 కోట్లు ఖర్చుపెట్టడం విశేషం. ఈ గొల్డెన్ బాబాకు గతంలో క్రిమినల్ రికార్డు కూడా ఉంది. బాబాగా మారడానికి ముందు ఢిల్లీలో వ్యాపారవేత్త. పోలీస్ కేసుల నుంచి తప్పించుకోవడానిక బాబాగా మారడనే ఆరోపణలు ఉన్నాయి. ఏదిఏమైనా కన్వర్ యాత్రలో ప్రతిఏటా గోల్డెన్ బాబా పాల్గొనడం…ఆనవాయితీగా వస్తోంది.

- Advertisement -