సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై రేణు దేశాయ్ కామెంట్స్

136
renu deshai

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ లో పలువురిని టార్టెట్ చేశారు సుశాంత్ అభిమానులు. నెపోటీజం కారణంగానే సుశాంత్ మరణించాడంటూ మరికొంత సెలబ్రెటీలు తెలిపారు. బాలీవుడ్ నెపోటీజం వల్ల చాలా మందికి అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నెపోటీజమ్ పై స్పందించారు సీనియర్ హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మంచి టాలెంట్ ఉన్న న‌టుడు అని చెప్పింది. సుశాంత్ చాలా హిట్ సినిమాల్లో నటించారని గుర్తు చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధ కలిగించిందని తెలిపింది. సుశాంత్ మరణానికి నెపోటీజం కారణం అని చాలా మంది వాదిస్తున్నట్లు తాను కూడా విన్నాను…అయితే నెపోటీజం అనేది ఒక సినిమా ఇండ‌స్ట్రీలోనే లేదు.. ప‌ని చేసే ప్ర‌తిచోట ఉందన్నారు. ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వారు చాలా మంది పైకి వచ్చారిని ఆమె తెలిపింది.