తెలంగాణలో మరోసారి కేంద్ర బృందం పర్యటన…

78
Central Health Team

దేశంలో కరోనా వైరస్‌ రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. అయితే అన్ని రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా కంట్రోలింగ్‌లో కాస్త మెరుగ్గానే ఉంది. కానీ మొత్తంగా చూస్తే తెలంగాణలో కరోనా కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి. మరి కరోనా కేసులు ఇలా పెరుగుతూ పోతే తెలంగాణ కూడా ఎక్కువగా కరోనా సోకుతున్న 8 రాష్ట్రాల జాబితాలో చేరే ప్రమాదం ఉందని కేంద్రం భావించింది. వెంటనే కేంద్ర బృందాన్ని మరోసారి తెలంగాణ రాష్ట్రానికి పంపింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రంలో కేంద్ర బృందం మరోసారి పర్యటిస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తోంది.

మొదట టిమ్స్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తుంది. ఇప్పటికే రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై అంచనా వేయడానికి ఎప్పటికప్పుడు కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాల అధికారులతో చర్చించనుంది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి అగర్వాల్ నేతృత్వంలో ఈ బృందం పర్యటిస్తోంది. దేశంలో కరోనా ప్రవేశించిన నాటి నుంచి కేంద్రం తమ బృందాలను పంపి రాష్ట్రప్రభుత్వాల అప్రమత్తతతో సమాచారాన్ని సేకరిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల ఆధారంగా సూచనలు, సలహాలు ఇస్తోంది.