మహేశ్ బాబు మూవీలో రేణు దేశాయ్

313
mahesh babu renu deshaimahesh babu renu deshai
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణంలో అడవి శేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈమూవీకి మేజర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. 26/11 ముంబై దాడుల్లో టెర్రరిస్టులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ చిత్రం రూపొందుతోంది. త్వరలోనే ఈమూవీ షూటింగ్ ప్రారంభంకానుంది. అయితే ఈమూవీలో సినీయర్ హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటించనున్నట్లు సమాచారం.

ఈమూవీలో ఓ కీలక పాత్రకు గాను రేణు దేశాయ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈమూవీలో రేణు దేశాయ్ చేయబోయే పాత్ర చిన్నదే అయినా చాలా పవర్ ఫుల్ పాత్ర కావడంతో ఆమె అంగీకరించే అవకాశాలు వున్నాయని అంటున్నారు. కాగా చాలా రోజుల నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది రేణు. మహేశ్ బాబు బ్యానర్లో రీ ఎంట్రీ ఇస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -