ఆన్ లైన్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా

274
sushantsingh last movie
- Advertisement -

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణం బాలీవుడ్ లో చర్చాంశనీయంగా మారింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరగా నటించిన చిత్రం దిల్ బెచారా. ముఖేశ్ ఛాబ్రా దర్శకత్వం వహించిన ఈసినిమాలో సుశాంత్ సరసన సంజనాసంఘి హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించాడు.ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈమూవీ విడుదలకు రెడీ అయింది. జులై 24న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో దిల్‌ బెచారా విడుదల కానుంది.

హాలీవుడ్ చిత్రం ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ రీమేక్‌గా ‘దిల్ బేచారా’ తెరకెక్కింది. ప్రేమ, ఆశ, ముగింపులేని జ్ఞాపకాల సమ్మేళనం. అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సుశాంత్‌ సినిమాను సెలబ్రేట్‌ చేసుకుంటూ జులై 24న మీ ముందుకొస్తుందని డిస్నీ హాట్‌స్టార్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. కాగా ఈమూవీ ఇది వరకే విడుదల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో థియేటర్లు మూసి ఉండటంతో వాయిదా పడింది. అయితే ఈమధ్య కాలంలో థియేటర్లు తెరిచే అవకాశం లేకపోవడంతో ఆన్ లైన్ లో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు నిర్మాతలు.

- Advertisement -