మొక్కలు నాటిన నటి ప్రణవి మానుకోండ..

181
Actress Pranavi Manukonda

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి హీమజ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన వర్థమాన నటి ప్రణవి మానుకోండ నేడు జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రణవి మాట్లాడుతూ.. మనమందరం గాలి పీల్చుకోవాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఇందులో భాగంగా మరో ముగ్గురు లక్ష్మీ, సింధు, విష్ణు ప్రియలకు ఛాలెంజ్ విసురుతున్నానని వారు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసరాలని తెలుపుతున్నానని నటి ప్రణవి మానుకొండ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.