నేడు ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు

105
corona tests

కరోనా మహామ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజుకు కొన్ని వేల మంది కరోన బారిన పడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24గంటల్లో 706 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ణారణ అయింది. 30,216మందికి పరీక్షలు చేయగా 706మందకి పాజిటివ్ గా వచ్చినట్లు తెలిపారు ఆరోగ్యశాఖ అధికారులు. కాగా 302మంది నేడు కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో మొత్ం 11,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 6,387 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 4,987 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 180కి చేరింది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 13,891 కేసులు నమోదయ్యాయి.