నో కిస్సింగ్ అంటోన్న రెజీనా..!

35
Regina

టాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది రెజీనా కసాండ్ర. మద్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికి మళ్ళీ వరస సినిమాలలో అవకాశాలను అందుకుంటు సక్సస్‌లు తన ఖాతాలో వేసుకుంటుంది. అయితే గత కొన్ని నెలలుగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలను బంద్‌ చేశారు. కాగా ఇటీవలే సినిమా ష్యూటింగ్‌లకు అనుమతించారు. ఈ కరోనా వైరస్ మహమ్మారి కాలంలో క్లోజప్ సన్నివేశాల్లో నటించాలంటేనే అంతా భయపడుతున్నారు. దేశవ్యాప్తంగా పలువురు నటులు దీనిపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో హీరోయిన్ రెజీనాకు కరోనా భయం పట్టుకుందాట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ-కౌగిలింత లేదా ముద్దు వంటి సన్నిహిత సన్నివేశాల్లో నటించడానికి భయ పడుతున్నానని .. ప్రాణాంతక వైరస్ సంభవిస్తుందనే భయంగా ఉంది అని తెలిపింది. రెజీనా ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ. ఈ అమ్మడు నటించిన తమిళ్ – తెలుగు ద్విభాషా చిత్రం పార్టీ రిలీజ్ కి రావాల్సి ఉంది. దీంతో పాటే నేంజమ్ మరప్పథిల్లై- కసడ తపర- కల్లాపర్ట్ అనే చిత్రాల్లో నటిస్తోంది.