కరోనా కంటే డేంజర్ పేదరికం, నిరుద్యోగం..!

50
sonu

కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్నటి నుంచి నటుడు సోనుసూద్ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. కరోనా లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికుల పట్ల సోనుసూద్ చూపించిన మానవత్వానికి, వాళ్లను ఆదుకున్న తీరుకు యావత్ దేశం ఫిదా అయింది. రీల్ లైఫ్‌లో విలన్ అయిన సోనుసూద్ రియల్ లైఫ్ లో మాత్రం తన అసమాన సేవాభావంతో దేశ ప్రజల గుండెల్లో రియల్ హీరోగా నిలిచారు. సోనుసూద్ చేతికి వెన్నెముక లేదు. ఇప్పటికీ సోనుసూద్ దేశంలో ఎక్కడ ఎవరికి ఏ కష్టం ఉన్నా నేనున్నానంటూ వారి కష్టాలను తీరుస్తూ…కొండంత భరోసా ఇస్తున్నారు.

అందుకే సోనుసూద్‌ను ఇప్పుడు బ్రదర్ ఆఫ్ ఇండియాగా భారతీయులు కొనియాడుతున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా సోనుసూద్ చెప్పిన ఓ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్‌లో ఊపందుకుంటుంది అనే వార్తల నేపథ్యంలో ఓ వ్యక్తి కరోనా థర్డ్ వేవ్ పై మీరు ఏమని అనుకుంటున్నారు.. థర్డ్ వేవ్ వస్తుందని మీరు కూడా భావిస్తున్నారా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించగా..దానికి సోనుసూద్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. మనం ప్రెజెంట్ ట్ థర్డ్ వేవ్ ను అనుభవిస్తున్నామని , పేదరికం నిరుద్యోగం కంటే కరోనా థర్డ్ వేవ్ ఎక్కువ కాదు అని ఆయన కామెంట్స్ చేశారు.

ఇది పోవాలంటే అందరు ముందుకు వచ్చి నిరు పేదలకు సహాయం చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించండి అంటూ సోనుసూద్ ట్వీట్ చేశారు. నిజమే కదా…కరోనా థర్డ్ వేవ్ కంటే ప్రమాదకరం…పేదరికం, నిరుద్యోగం..దేశంలో కరోనా మహమ్మారితో పేదరికం మరింత పెరిగిపోయింది. లాక్‌డౌన్‌లతో ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లేక పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అందుకే కరోనా మహమ్మారి కంటే పేదరికం, నిరుద్యోగం అనే మహమ్మారి మనల్ని కబళించకముందే అందరూ సాయం చేసేందుకు రావాలని సోనుసూద్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు దేశ ప్రజలందరిని ఆలోచింపజేస్తోంది. హ్యాట్సాఫ్ సోనుసూద్ సర్..!