ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి: జగ్గారెడ్డి

14
jaggareddy

బీజేపీ పార్టీ,బీజేపీ ప్రభుత్వం హిందూమత మత్తు ఇచ్చి దేశ ప్రజలకు సర్జరీ చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి…బీజేపీకి పలు ప్రశ్నలు సందించారు.

నల్లదనం తెచ్చి పేదల అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అన్నారు ఏమైంది..? .. తెలంగాణ కి వస్తున్న బీజేపీ ముఖ్యమంత్రులు… 15 లక్షల ప్రస్తావన తేవడం లేదు ఎందుకు..? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు మాట మీద నిలబడే మనుషులు కాదన్నారు. . కాంగ్రెస్ ఏం చేసింది అంటుంది… కాంగ్రెస్ చేసినప్పుడు మోడీ పుట్టలేదన్నారు. వల్లభాయ్ పటేల్..సుభాష్ చంద్రబోస్.. కాంగ్రెస్ వాళ్ళే…. బీజేపీ ఇప్పుడు వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టింది.. చరిత్ర మార్చే కుట్ర చేస్తుంది తప్పితే చేసింది ఏం లేదన్నారు.

స్వాతంత్య్రం తెచ్చింది.. కాంగ్రెస్…. సమస్యలు తీర్చింది కాంగ్రెస్… సమస్యలు సృష్టించేది బీజేపీ అన్నారు. బీజేపీ కి విలువలు ఉన్నాయా..? కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చి గద్దె నెక్కింది బీజేపీ కాదా..? అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది.. ఏమైంది..? అని ప్రశ్నించారు. వరి కొనుగోలు సమస్య తేచ్చిందే బీజేపీ ….. విచిత్ర ఉద్యమాలు చేస్తుందన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలు పక్కన పెట్టి..మతం రంగు పులుముతుందన్నారు. షార్ట్ కట్ లో అధికారం లోకి రావాలని చూస్తుంది…కాంగ్రెస్ నీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అన్నారు. పెట్రో ధరలు.. 15 లక్షల నల్లదనం , వరి ధాన్యం అంశాలపై నిరసనగా ఉద్యమం చేస్తా….కేంద్ర మంత్రులను నిలదీస్తా అన్నారు.