కేటీఆర్‌పై అభిమానం చాటుకున్న యువ రైతు..

42
minister ktr

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామా రావు మీద ఉన్న అభిమానంతో ఓ యువ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ అనే మూడు అక్షరాలను తన వరి నారులో సృష్టించి కేటీఆర్ పై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నాడు. రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన శనిగరపు అర్జున్ అనే యువ రైతు తనకున్న అభిమానంతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేరును తన వ్యవసాయ క్షేత్రంలో గల వరి నారుమడిలో ఆంగ్ల అక్షరాలతో కేటీఆర్ అనే పేరును సృష్టించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

శనిగరపు అర్జున్ మాట్లాడుతూ.. కేటీఆర్ పైన ఉన్న అభిమానంతోనే తన వరి నారుమడిలో కేటీఆర్ అనే అక్షరాలను సృష్టించారని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న రైతు బంధు, రైతు బీమా, నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా కల్పించి రైతులకు అండగా ఉంటున్నారని భవిష్యత్తులో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కొరకు మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రైతులకు అండగా నిలవాలని కోరుకుంటున్నాని అని తెలిపాడు.