రైతులతో కేంద్రం ఏడో విడత చర్చలు..

140
Farmers
- Advertisement -

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు రైతు సంఘాలతో కేంద్రం ఏడో దఫా చర్చలు ప్రారంభమైయ్యాయి. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం, రైతుల సంఘాల నాయ‌కుల మ‌ధ్య ఏడో విడ‌త చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ఈ మ‌ధ్యాహ్నం రెండు గంట‌లకు కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు, రైతుల ప్ర‌తినిధులు స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నరేంద్ర‌సింగ్ తోమ‌ర్‌, కేంద్ర రైల్వే, వాణిజ్య మరియు ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌, వాణిజ్య ప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హాయ మంత్రి సోం ప్ర‌కాష్‌, ప‌లువురు ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న మొద‌లైన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌ర‌ణించిన రైతుల ఆత్మశాంతి కోసం కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు, రైతు సంఘాల నేత‌లు రెండు నిమిషాల‌పాటు మౌనం పాటించారు. అనంత‌రం వ్య‌వ‌సాయ చ‌ట్టాల్లో రైతుల అభ్యంత‌రాల‌పై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయెల్ రైతులతో చర్చలకు ముందు అరగంట పాటు అధికారులతో సమావేశం అయ్యారు.

- Advertisement -