చేనేత- జౌళి శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

135
ktr
- Advertisement -

వరంగల్ జిల్లా కొడకండ్ల లో మినీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కే రామారావు తెలిపారు. వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి మేరకు అక్కడ ఉన్న నేతన్నలకు మరింత ప్రయోజనం కల్పించే దిశగా ఒక మినీ పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంతో పాటు కొడకండ్లలో పార్క్ ఏర్పాటుకు ఉన్న అనుకూల పరిస్థితుల పరిగణలోకి తీసుకొని మినీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కొడకండ్ల లో నైపుణ్యం కలిగిన వేలాదిమంది నేతన్నలు తమ పని కొనసాగిస్తున్నారని, చాలామందికి సరైన ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళారని, అయితే రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, టెక్స్టైల్ రంగానికి ఇస్తున్న మద్దతు వల్ల అనేకమంది తెలంగాణకు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఇదేవిధంగా కొడకండ్లలోనూ వందలాది మంది ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కావాలని కోరుతున్న నేపథ్యంలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రోజు ప్రగతి భవన్‌లో జరిగిన టెక్స్టైల్ డిపార్ట్మెంట్ సమీక్ష సమావేశంలో ఈ మేరకు మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మినీ టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినందుకు పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుకు, వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పార్క్ ద్వారా కొడకండ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సుమారు 20,000 నేతన్న కుటుంబాలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని దయాకర్ రావు అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ చేనేత మరియు జౌళి రంగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సమీక్షించారు. ప్రస్తుతం నేతన్నల కోసం కొనసాగిస్తున్న అన్ని  సంక్షేమ కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల తయారీ కార్యక్రమాన్ని ఈసారి కూడా కొనసాగిస్తామన్నారు. దీంతోపాటు గతంలో ప్రారంభించిన నేతన్నకు చేయూత కార్యక్రమం ద్వారా కరొన సంక్షోభ కాలంలో నేతన్నలకు పెద్దఎత్తున ప్రయోజనం కలిగిందన్నారు.

కాల పరిమితి కన్నా ముందే తమ పొదుపు తో పాటు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ని ఒకేసారి వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపు ద్వారా సుమారు 95 కోట్ల రూపాయలు, 25,000 మంది నేతన్నల కుటుంబాలకు అందాయన్నారు. ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించాలని నేతన్నల నుంచి వస్తున్న సూచన మేరకు త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో టెక్స్టైల్ మరియు చేనేత రంగాల కి కేటాయించాల్సిన అంశాలకు సంబంధించి పూర్తి కసరత్తు చేయాలని టెక్స్టైల్ డిపార్ట్మెంట్ తరఫున ఒక నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -