ఉత్కంఠపోరులో హైదరాబాద్ గెలుపు..

36
- Advertisement -

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు జరిగింది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో హైదరాబాద్ గెలుపొందింది. 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ చివరి బంతికి విజయాన్ని సాధించింది. చివరి ఓవర్‌లో విజయానికి 17 పరుగులు కావాల్సిఉండగా లాస్ట్ బాల్‌కి సమద్ సిక్స్ బాది జట్టును గెలిపించాడు.

అభిషేక్ శ‌ర్మ‌ (55), రాహుల్ త్రిపాఠి(47), అన్మోల్‌ప్రీత్ సింగ్(33), హెన్రిచ్ క్లాసెన్(26) గ్లెన్ ఫిలిప్స్( 25) లు రాణించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో చాహ‌ల్ నాలుగు వికెట్లు తీయ‌గా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, కుల్‌దీప్ యాద‌వ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

Also Read:డెలివరీ బాయ్‌గా రాహుల్

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన‌ రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్(95..59 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) వీర‌విహారం చేయ‌గా సంజు శాంస‌న్‌(66 నాటౌట్; 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), య‌శ‌స్వి జైస్వాల్‌(35; 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు దూకుడుగా ఆడారు.

Also Read: Karnataka Polls:సోనియాపై ఓవైసీ ఫైర్

- Advertisement -