కర్ణాటకలో పాల, పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయి అని మండిపడ్డారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు అవుతున్నప్పటి నుంచి పాల ధరలు, పెట్రోల్ ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, మద్యం, వాహన పన్ను, వాహన రిజిస్ట్రేషన్ చార్జీలు, జనన-మరణ సర్టిఫికేట్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.
ఒక వైపు సంక్షేమ హామీలు ఇస్తున్నారు, మరోవైపు ప్రజల దగ్గర అధిక పన్నులు వసూలు చేస్తున్నారు. హామీల అమలుకు ప్రతి సంవత్సరం ₹50,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు కానీ వాస్తవంగా ₹60,000 – ₹70,000 కోట్లు ప్రజల నుండి వసూలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు. పాల ధరను రెండవసారి పెంచారు అన్నారు.
కర్ణాటక ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి నందిని పాల, పెరుగు ధరను లీటరుకు రూ.4 పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) చైర్మన్ భీమ నాయక్ పాల ధర పెంపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలో తక్కువ ధరకు పాలను విక్రయిస్తున్నాం అన్నారు. కర్ణాటకలో పాల ధర లీటరుకు రూ.42, గుజరాత్‌లో రూ.53, ఆంధ్ర-తెలంగాణలో రూ.58, ఢిల్లీ-మహారాష్ట్రలో రూ.56, కేరళలో రూ.54గా ఉందని పెంచిన రూ.4 నేరుగా రైతులకే చేరుతాయి అన్నారు.
Also Read:వీడియో:గొరిల్లా దాహం తీర్చిన వ్యక్తి!

