తలసేమియా డే:ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?

57
- Advertisement -

తలసేమియా ఒక జన్యు సంబంధమైన వ్యాధి. మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ అందించేది మన రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హీమోగ్లోబిన్‌. ఎర్రరక్త కణాల తయారీలో ఏదైనా లోపం జరిగి, అవి సరిగ్గా ఏర్పడకపోతే వాటి ఆయుష్షు తగ్గిపోయి, త్వరగా చనిపోతాయి. శరీరంలో రక్తం శాతం తగ్గిపోయి రక్తహీనత ఏర్పడి మనిషి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. బిడ్డకు జన్మనిచ్చే వారి వల్లే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. తలసేమియా అంటే గ్రీక్ భాషలో సముద్రం అని అర్థం. ఈ వ్యాధికి గురైన చిన్నారికి జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి.

సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్ లెక్కల ప్రకారం ప్రపంచంలో నాలుగున్నర శాతం మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. భారతదేశంలో మూడు కోట్ల యాభై లక్షల మందికి పైగా తలసేమియా బారినపడ్డారు.తల్లిదండ్రుల్లో ఉండే జన్యుపరమైన లోపాల వల్లగానీ, జన్యువుల్లో వ్యత్యాసాల వల్లగానీ ఈ వ్యాధి సంక్రమిస్తుంది. హిమోగ్లోబిన్‌ నిల్వలు పడిపోయిన ప్రతిసారీ హిమోగ్లోబిన్‌ని కృత్రిమంగా రక్తం ద్వారా అందించాలి. సకాలంలో అందించకపోతే ప్రాణం పోతుంది.

Also Read:తెల్లటి మెరిసే దంతాల కోసం..

లక్షణాలు..

()మూడు నెలల వయస్సు నుంచి 18 నెలల వయస్సు మధ్యలో ఈ వ్యాధి బయటపడుతుంది.
()ముఖం పీక్కుపోయి, బాల్యంలోనే ముడతలు పడినట్టుగా తయారవుతుంది.
()శరీర రంగు తేడాగా ఉంటూ, పాలిపోయినట్టుగా మారుతుంది.
()శారీరక ఎదుగుదల ఉండదు
()బొడ్డు భాగంలో వాపుంటుంది.
()తరచుగా అనారోగ్యాలకు గురవుతుంటారు

Also Read: కేరళ స్టోరీ..తమిళనాట వివాదం

- Advertisement -