Karnataka Polls:సోనియాపై ఓవైసీ ఫైర్

48
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీ సీనియర్ నేత జగదీశ్ షెట్టర్‌కు బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. జగదీశ్ షెట్టర్ తరపున ప్రచారం సోనియా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఓవైసీ.

Also Read:ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్.. రచనలు ఎంతో స్పెషల్

మేడమ్ సోనియాగాంధీ జీ మీరు ఆర్ఎస్ఎస్‌కు చెందిన వారికోసం ప్రచారానికి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. జగదీశ్ షెట్టర్‌ ఆర్ఎస్ఎస్‌కు చెందిన వ్యక్తిగా పిలువబడతాడు. అతని తరపున ప్రచారం చేస్తారని నేను ఊహించలేదన్నారు. ఇదేనా మీ సెక్యులరిజం, మోదీని ఇలాగే ఎదుర్కోవాలా? అంటూ ప్రశ్నించారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ సైద్ధాంతిక పోరాటంలో ఓడిపోయింది. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఏఐఎంఐఎం బీజేపీకి బీ టీంగా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి…

Also Read:Ragi Ambali:అంబలితో ఆరోగ్యం

- Advertisement -