రైతురాజ్యంగా తెలంగాణ: మంత్రి కేటీఆర్

347
ktr
- Advertisement -

దేశంలోనే తెలంగాణ నెంబర్‌ 1 స్ధానంలో నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన కేటీఆర్‌…అనంతరం మాట్లాడారు. తెలంగాణ రైతు రాజ్యంగా బాసిల్లుతోందని, స్వతహాగా రైతు కావడం వల్లే కేసీఆర్‌ రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.

కరోనా కారణంగా స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందని…. ఎన్నడూ లేని విధంగా క‌రోనా క‌ష్ట కాలంలో కూడా రూ.30వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ది అన్నారు.

సివిల్‌ హాస్పిటల్‌ డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలతోనే కరోనా నుంచి బయపడినట్లు చెప్పిందని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 72శాతం మంది రికవరి కాగా, ఇండ్లకు వెళ్లారని, మిగతా వారంతా చికిత్స పొందుతున్నారన్నారు. వైద్యులు, సిబ్బంది గొప్పగా పని చేస్తున్నారన్నారు.

ఖమ్మం జిల్లాలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తెలంగాణ ఆవిర్భావంతో ప‌ల్లెలు ప్రగతి పథంలో ప‌య‌నిస్తున్నాయ‌ని…. తెలంగాణ ప్రగతిని చూసి అనేక రాష్ట్రాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను కాపీ కొడుతున్నాయని చెప్పారు.

గ్రామాల్లో 24 గంట‌ల‌పాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా, ఇంటింటికీ మిష‌న్ భ‌గీర‌థ ద్వారా ఆరోగ్యకరమైన, శుద్ధి చేసిన మంచినీరు అందుతుంద‌న్నారు. ప‌ల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.339 కోట్లు విడుద‌ల చేయడం దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు.

- Advertisement -