మొక్కలు నాటడం జాతీయ సమైక్యతకు స్ఫూర్తిః చాగంటి

446
Chaganti Green Challeange
- Advertisement -

మొక్కలు నాటడం జాతీయ సమైక్యతకు స్ఫూర్తి అన్నారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వర్ రావు. ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో మొక్కలు నాటారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ,ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యులు రాఘవ, గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి కిషోర్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా చాగంటి కోటేశ్వర్ రావు మాట్లాడుతూ.. భగవంతుడే చెట్టు రూపంలో ఈ భూమ్మీద ఉంటాడని వేదం చెప్తుంది. చెట్లు ఎంత కాలం బాగుంటాయో ,చెట్లు ఎంత కాలం వృద్ధిలోకి ఉంటాయో అంతకాలం సమస్త ప్రాణ కోటి ఎంతో సంతోషంగా ఉండడానికి అవకాశము ఉంటుంది. గ్రీన్ ఇండియా సంస్థ వారు దీన్ని ఒక ఉద్యమంలా తీసుకెళ్లి తోటి వారితో మూడు మొక్కలు నాటించడం వాటిని రక్షించి కొన్ని కోట్ల చెట్లయ్యేలా దీన్ని ఉద్యమ స్పూర్తితో నిర్వహించడం చాలా అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమం వల్ల సకల జనులకు సకల ప్రయోజనాలు అందుతాయి.మొక్కలు నాటడం జాతీయ సమైక్యతకు స్ఫూర్తి.. ఇది విశ్వమంతా వ్యాపించి చెట్ల సంఖ్య పెరిగి అందరూ సంతోషంగా ఉండాలి. ఇంత గొప్ప కార్యక్రమానికి ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -