చివరి శ్వాస తెలంగాణ కోసమే:కేసీఆర్

9
- Advertisement -

ఏజెన్సీ ప్రాంతాలు మారుమూల గ్రామాల ప్రజలకు పాలన అందుబాటులోకి రావాలని కొత్తగూడెం జిల్లాను చేసుకున్నాం అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి జిల్లాను రద్దుజేయాలంటుండు, కొత్తగూడెం జిల్లా వుండాల్నా .? ఉండాలే ఉండాలే అని ప్రజలనుంచి స్పందన వచ్చింది.ఏడవ రోజు బస్సు యాత్ర కొత్తగూడెం రోడ్డు షోలో మాట్లాడిన కేసీఆర్.. అడ్డగోలు హామీలిచ్చిండ్రు కాంగ్రెసోళ్లు అని దుయ్యబట్టారు.

తులం బంగారం అన్నరు, 2500 మహిళలకు అన్నరు, రెండు లక్షలు రుణమాఫీ అన్నరు,అయినయా..? ఇచ్చిండ్రా ఆలోచించాలన్నారు. ఆరు గ్యారంటీలకు చట్ట బద్ధత కలిపిస్తాం అన్నారు..చేయలే, 24 గంటల కరెంటు అన్నారు చేయలే,పినపాక నియోజకవర్గం లో ఒక చిన్నగూడెం కు కూడా మిషన్ భగీరథ నీళ్లు పంపినం, గిరిజన తండాలు 3 ఫేస్ కరెంటు ఇచ్చినం అన్నారు కేసీఆర్.

లక్షా యాభై వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినం..వాటికి రైతుబంధు ఇచ్చినం, ఇప్పుడిస్తున్నారా.? ఆలోచించాలన్నారు. ఓవర్సీస్ స్కాలర్‌ షిప్ ఇస్తున్నారా?,హైదరాబాద్ లో ఖరీదైన బంజారహిల్స్ లో అదివాసీ భవన్ బంజారాబవన్ కట్టినం గతంలో ఎవాలన్నా కట్టిండ్రా..?, మీరంతా ఆలోచించాలి
,కరెంటు కాటగల్సిందన్నారు. సింగరేణి ని కూడా ముంచె కార్యక్రమం పెట్టుకుండు సీఎం రేవంత్ రెడ్డి, బడే భాయ్ చోటే బాయ్ కలిసి సింగరేణి ని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ నన్ను బొగ్గు కొనాలని వత్తిడి చేసిండు నేను వినలే, కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూయిస్తున్నారన్నారు. ఇగ బీజేపీ ది దుర్మార్గమైన పాలన, మతాల నడుమ పంచాతిపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తుందన్నారు.

గోదావరిని ఎత్తుకపోయి తమిళనాడు కు అప్పగించాలని చూస్తున్నాడు మోడీ, మరి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడో చెప్పాలన్నారు. కేంద్రం మోటర్లకు మీటర్లు పెడుదామని చూస్తున్నారు, యువకులకు ఒకటే మాట చెప్తున్న జాగ్రత్తగా వినాలి, కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్సులు పెడుతే ఆటో రిక్షాల వాళ్ల బతుకులు ఆగమైమైనాయన్నారు. వాళ్ల బతుకులు బాగు పడాలంటే బిఆర్ఎస్ గెలువాలే, తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం నిలబడాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. మోడీ రేవంత్ ఒకటే ఎవలికీ ఓటేసినా ఒకటె, నా ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన, ఏనాడు అశాంతి లేకుండా పాలన చేసినం అన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకు తెలంగాణ సెక్యులర్ స్టేట్ గానే ఉంటుందన్నారు.

Also Read:Harishrao:రేవంత్‌ చేసేవి తప్పుడు పనులు

- Advertisement -