బర్త్ డే.. మొక్కలు నాటిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

35
green challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ లో మొక్కలు నాటారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరు తమ తమ పుట్టినరోజు పురస్కరించుకుని పర్యావరణానికి మేలు కలిగించే ఈకార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి జరుపుకోవాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా విజయవంతంగా కొనసాగుతుందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఎమ్మెల్యే ముఠా గోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.