“సరిలేరు నీకెవ్వరు” టీంకు మెగాస్టార్ సర్ ప్రైజ్

373
Sarileru Nikevaru

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ఈమూవీ టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. కాగా ఈమూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జనవరి 5న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.

ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి మెగాస్టార్ రాబోతున్నారని.. మెగా సూపర్‌ ఈవెంట్‌ కోసం సిద్ధంగా ఉండండి అని మూవీ యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో మీరు మెగా ఈవెంట్లను చూసి ఉండొచ్చు. సూపర్ ఈవెంట్లు చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చరిత్ర సృష్టించబోతున్నాం. సూపర్‌స్టార్ హోస్ట్ చేయబోతున్న ఈవెంట్‌కు మెగాస్టార్ అతిథిగా రాబోతున్నారు. మెగా సూపర్ ఈవెంట్‌కు సిద్ధమవ్వండి అని సరిలేరు నీకెవ్వరు టీమ్ తెలిపింది. మహేశ్ బాబు ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా రానుండటంతో మహేశ్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.