శనివారం ప్రగతి భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఎంత మొత్తంలో జీతాలు పెంచామనే విషయాన్ని ప్రకటించారు.. 24 కేటగిరీలలో తక్కువ వేతనాలున్న వారి జీతాలు పెంపు ఆ వివరాలు ఇవి..
– ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్లు:రూ.6,260 నుండి రూ.12,000 వరకు 52.1 శాతం పెంపు.
– వీఆర్ఏ:రూ.6,500 నుంచి రూ. 10,500 వరకు 64.61 శాతం పెంపు.
– వీఏఓ:రూ.1,500 నుంచి రూ.5,000 వరకు 333 శాతం పెంపు.
– కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్: రూ.10,900 నుంచి రూ.14,800 వరకు 73.64 శాతం పెంపు.
– ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు: రూ.6,700 నుంచి రూ.12,000 వరకు 55.83శాతం పెంపు,రూ.8,400 నుంచి రూ.15,000 వరకు 56 శాతం పెంపు, రూ.10,900 నుంచి రూ.17,000 వరకు 64.11 శాతం పెంపు.
– కాంట్రాక్టు లెక్చరర్లు: రూ.18,000 నుంచి 37,100 వరకు 100 శాతం పెంపు,
– పార్ట్ టైమ్ లెక్చరర్లు:పీరియడ్ ల వారీ పేమెంట్ నుంచి రూ.21,000 వరకు పెంపు.
– అటెండర్లు: రూ.3,900 నుంచి రూ.7800 100శాతం పెంపు.
– నరేగా ఉద్యోగులు: రూ.6,290 నుంచి రూ.10,000 వరకు 62.9శాతం పెంపు.
– సెర్ఫ్ ఉద్యోగులు: రూ.6,220 నుంచి రూ.12,000 వరకు 100 శాతం పెంపు.
– అంగన్ వాడీ కార్యకర్తలు: రూ.4,200 నుంచి రూ.10,500 వరకు 250శాతం పెంపు.
– అంగన్ వాడీ హెల్పర్లు: రూ.2,200 నుంచి రూ.6,000 272శాతం పెంపు.
-జీహెచ్ ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు: రూ.8,500 నుంచి రూ.14,000 వరకు 60శాతం పెంపు.
– జీహెచ్ఎంసీ డ్రైవర్లు: రూ.10,200 నుంచి రూ.15,000 వరకు 68శాతం పెంపు.
– ఆశ వర్కర్లు: రూ.1,000-1,500 నుంచి రూ.6,000 వరకు పెంపు 600 శాతం పెంపు.
– కాంట్రాక్టు వార్డెన్లు: రూ.5,000 నుంచి రూ.21,000 వరకు 420 శాతం పెంపు పెంపు.
– కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు: రూ.4,000 నుంచి రూ.15,000 వరకు పెంపు 375 శాతం పెంపు.
– పీఈటీలు: రూ.4,000 నుంచి రూ.11,000 వరకు పెంపు 275 శాతం పెంపు.
– అకౌంటెంట్లు: రూ.3,500 నుంచి రూ.10,000 వరకు పెంపు 153 శాతం పెంపు.
– ఏఎన్ఎంలు రూ.4,000 నుంచి రూ.9,000 వరకు పెంపు 225 శాతం పెంపు.
– వంటవారు, ఆయాలు, హెల్పర్లు, స్వీపర్లు, వాచ్ మెన్లు: రూ.2,500 నుంచి రూ.7,500 వరకు పంపు 300 శాతం పెంపు.
– రేషన్ డీలర్లు: కమిషన్ 1 కిలో బియ్యంపై 20 పైసల నుంచి 70 పైసలకు పెంపు 350 శాతం పెంపు.
– 108 సిబ్బంది ఒక్కొక్కరికి రూ. 4,000 పెంపు.