తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!

206
rains
- Advertisement -

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ భారత తీరం వైపున కదులుతూ రాగాల 24 గంటల్లో పెను తుఫాన్‌‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాజధాని హైదరాబాద్‌లో రాగల 36 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గాలిలో తేమ 55 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -