దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

77
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 8,439 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 195 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,56,822కు చేరగా 3,40,89,137 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్‌ కేసులుండగా ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 4,73,952 ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్‌లో భాగంగా 129.5 కోట్ల డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.