కూలీల కడుపునింపుతున్న ఎంపీ సంతోష్‌..

220
swaroopa

లాక్ డౌన్‌తో పేదలు ఆకలితో అలమటించకుండా చూడాలన్న సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఎంపి సంతోష్ కుమార్ పేరిట చేపట్టిన అన్నదానం దిగ్విజయంగా కొనసాగుతుంది. కరీంనగర్ లోని 40వ డివిజన్ లోని ఈఎన్ గార్డెన్‌లో చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణితో కలిసి అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ప్రారంభించారు. వలసకూలీలకు వీరు స్వయంగా భోజనాలు కూడా వడ్డించారు. కరోనా ప్రబలుతున్న నేపధ్యంలో… సామాజిక దూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నారు నిర్వాహకులు.

food distribution in karimnagar

అలాగే 15 రోజుల వరకు అవసరమయ్యే నిత్యవసర వస్తువులను వలస కూలీలకు అందజేశారు. సీఎం కేసీఅర్ పిలుపు మేరకు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన కూలీల ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చిన ఎంపీ సంతోష్ కుమార్‌కు అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణిలు ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ సంతోష్ కుమార్ తన సొంత ఖర్చులతో రోజు వెయ్యి మంది అకలి తీర్చడం అభినందనీయమన్నారు.