ఏపీలో కరోనా మరింత ఉదృతం..

51

కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రరూపం దాల్చింది. ఏపీలోనూ ఆ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 31,929 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,309 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,053 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ముగ్గురు బలయ్యారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,291కి పెరిగింది. అటు, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,21,906కి చేరింది. 8,95,949 మంది కోలుకున్నారు. ఇంకా 18,666 మంది చికిత్స పొందుతున్నారు.

24 గంటల్లో నమోదైన కేసులలో చిత్తూరు జిల్లాలో భారీ స్థాయిలో 740 పాజిటివ్ కేసులు.. గుంటూరు జిల్లాలో 527, విశాఖ జిల్లాలో 391, కర్నూలు జిల్లాలో 296 కేసులు వెల్లడయ్యాయి. ఏపీలోని 13 జిల్లాల్లో విజయనగరం (97), పశ్చిమ గోదావరి (26) జిల్లాల్లో మాత్రం రెండంకెల్లో కొత్త కేసులు నమోదయ్యాయి.