దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

63
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 22,431 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 318 మంది మృతిచెందారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,44,198 యాక్టివ్ కేసులుండగా 3,32,00,258 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన‌వారి సంఖ్య 4,49,856కి చేరింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 92,63,68,608 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్లడించింది.