నేను చెప్పిన ప్యానల్‌కే ఓటేయాలి..అప్పుడే ఆఫర్లు

30
ajay bhupathi

అక్టోబర్ 10న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది హీట్ పెరిగిపోగా విష్ణు- ప్రకాశ్‌ రాజ్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఇలాంటి తరుణంలో మళ్లీ బాంబు పేల్చారు ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు అజయ్‌ భూపతి.

నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా…(అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు) అంటూ ట్వీట్ చేశారు అజయ్. దీంతో పైకి కనపడకున్నా లోలోపల మాత్రం పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వం నడుస్తున్నట్లు తెలుస్తోంది.