ప్రభాస్‌తో సందీప్ వంగా..!

30
sundeep

సాహో తర్వాత వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉండగా రాధేశ్యామ్ ఒక్కటే పూర్తయింది.

ఇక సలార్ , ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా ఈ రెండింటి తర్వాత నాగ్ అశ్విన్‌తో సినిమా చేయనున్నారు ప్రభాస్‌. ఈ మూడు సినిమాలే కాదు మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు ప్రభాస్.

ప్రభాస్ 25వ చిత్రం అర్జున్ రెడ్డి దర్శకుడు ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తో సినిమా చేయాలనీ ఎప్పటినుంచో అనుకుంటున్న సందీప్ వంగా.. కొత్త కథతో ప్రభాస్ ను ఇంప్రెస్ చేశాడట. టీ-సిరీస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది.