ఏపీలో కొత్తగా 193 కరోనా కేసులు..

189
corona in ap
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కరోనా మహమ్మారి దావళంలా వ్యాప్తిస్తోంది. ఏపీ ప్రభుత్వం గత 24 గంటల్లో 15911 శాంపిల్స్ టెస్ట్ చెయ్యగా 193 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వారికి తగిన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటోంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5280కి చేరింది. వాటిలో ఇప్పటివరకూ 2851 మంది డిశ్చార్జి అయ్యారు. అలాగే తాజాగా చిత్తూరు జిల్లాలో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 88కి చేరింది. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 2341గా ఉంది.

- Advertisement -