రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

17
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్ చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. రాష్ట్రంలో మూడు లక్షల పిచ్చి కుక్కలు ఉన్నాయని, ఆ పిచ్చి కుక్కల అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. పంటలు ఎండిపోతుంటే కనీసం నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, కేసీఆర్‌ హయాంలో వచ్చిన కరెంటు, రైతుబందు ఎందుకు రావడం లేదని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ మీద ఉన్న కసితోనే పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందని ఆరోపించారు.

కేసీఆర్‌ కంటే గొప్ప పాలన చేసే ప్రయత్నం చేయాలిగానీ ఇలాంటి పరిస్థితులు రాకూడదని, 15 నెలల స్కాంగ్రెస్ పాలనలో 15 స్కాములు జరిగాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరును ప్రజలు చూస్తున్నారని పాడి అన్నారు. తెలంగాణ సాధనే కేసీఆర్‌కు కొండంత పేరు తెచ్చిందని, పైగా 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ అభివృద్ధిని దేశానికి చూపెట్టారని కొనియాడారు.

ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్ష చావును కోరుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ చావాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ కేసీఆర్ చచ్చే వ్యక్తి కాదని, చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చిన వ్యక్తి అని పాడి పొగిడారు. రైతులు రైతుబంధు రాలేదని, రుణమాఫీ కాలేదని, నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని ఒక జర్నలిస్టుకి ఇంటర్వ్యూ ఇస్తే.. ఆ జర్నలిస్టును బెయిల్ రాకుండా కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు.

Also Read:ఎమ్మెల్యే రాజాసింగ్‌.. సంచలన వ్యాఖ్యలు

- Advertisement -