అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్: హరీష్

14
- Advertisement -

అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో అవే అబద్దాలు, బయటా అవే అబద్దాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని టీవీవీపీ విభాగంలో ఉన్న 13వేల మందికి జీతాలు చెల్లించనిది వాస్తవం కాదా? చెప్పాలన్నారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నది మీ కళ్లకు కనిపించడం లేదా? చెప్పాలన్నారు.

ఆరోగ్య శాఖలోనే కాదు, పోలీసు శాఖలోనూ ఇదే దుస్థితి నెలకొందన్నారు. పెంచిన జీతాలు, అలవెన్సుల మాట దేవుడెరుగు, ఉన్న జీతాలు ఇప్పటికీ రాక హోం గార్డులు ఆవేదన చెందుతున్నది నిజం కాదా? చెప్పాలన్నారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామనే అబద్దాన్ని, అవకాశం ఉన్న చోటల్లా ప్రచారం చేసుకునే మీకు.. వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల ఆవేదన అర్థం కావడం లేదా? చెప్పాలన్నారు.

దుష్ర్పచారంతోనే ఏడాదిన్నర గడిపారు. ఇంకెంత కాలం వెళ్లదీస్తారు.? , టీవీవీపీ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సహా, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోం గార్డులకు వెంటనే వేతనాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు హరీష్‌.

Also Read:సీఎం రేవంత్ రెడ్డికి స్టాలిన్ ఆహ్వానం

 

- Advertisement -