తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వర్సెస్ శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండడు స్పీచ్.. 15 నెలల పాలననీ.. 36 నిమిషాల్లో చదివేశారు అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. రైతులకు రుణమాఫీ చేశారా..?, మహా లక్ష్మీ పథకాన్ని అమలు చేశారా?.. రైతు కూలీలకు 12 వేలు రూపాయలు ఇచ్చారు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయల రుణా మాఫీ చేసిందని, పేదలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అమలులో ఉందని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. స్పీకర్ నీ బెదిరించే మాటలు మాట్లాడకండి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి అని పేర్కొన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి… స్పీకర్ గారిని బెదిరించేలా మాట్లాడటం సరికాదు అన్నారు. ఇది సభను అవమానించేలా ఉంది. ప్రజలు గమనిస్తున్నారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని సభకు క్షమాపణలు చెప్పాలి అన్నారు.
దీనికి స్పందించిన జగదీశ్ రెడ్డి ఈ సభలో సభ్యులందరికి పెద్దగా స్పీకర్ అక్కడ కూర్చొన్నారు తప్పా స్పీకర్ ది ఈ సభ కాదు.. నేను ఏం తప్పు మాట్లాడలేదు.. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేయగా గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
Also Read:ఎమ్మెల్యే రాజాసింగ్.. సంచలన వ్యాఖ్యలు

