రైతుల బాధలు పట్టవా?: బండి సంజయ్

5
- Advertisement -

నీటి విడుద‌ల అంశాన్ని సైతం సులువుగా కేంద్ర ప్రభుత్వంపై నెట్టేసి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తప్పించుకోవాలని అనుకుంటోందని మండిపడ్డారు కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన బండి.. ప్రభుత్వం నిర్లక్ష్యానికి రైతులు మూల్యం చెల్లించాలా చెప్పాలన్నారు.

వేస‌వి కాలం పూర్తిగా రాక‌ముందే నీళ్లు లేక 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నా.. ప్రభుత్వానికి అన్నదాతల ఆక్రందనలు వినిపించడం లేదని ప్రశ్నించారు కాలువల్లో నీళ్లు ఉన్నా ఎందుకు వదలడం లేదని… పంటలు ఎండుముఖం పడుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అన్నదాతలు అల్లాడుతున్నాడని అన్నారు.

ఇదేనా కాంగ్రెస్ మార్క్ రైతు సంక్షేమ రాజ్యమని ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై వెంటనే అసెంబ్లీలో చర్చించాలని.. కష్టాల్లో ఉన్న రైతంగాన్ని ఆదుకోవాలని అన్నారు. యాసంగి పూర్తయ్యేంత వరకు పంటలకు నీళ్లు వదలాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Also Read:ఉన్మాదిలా మాట్లాడుతున్న రేవంత్: హరీష్‌ రావు

- Advertisement -