అన్నలోని ప్రాణం నువ్వమ్మా..చిట్టి చెల్లెమ్మా

729
- Advertisement -

రాఖీ పర్వదినం నేడు. శ్రావణ పౌర్ణమి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండగ వేడుకలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. ఎంపీ కవిత తన అన్న మంత్రి కేటీఆర్‌కు రాఖీని కట్టారు. ఈ రోజు ఉదయమే సీఎం క్యాంప్ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. అనంతరం సోదరుడు కేటీఆర్ చేతికి రాఖీ కట్టి.. స్వీట్  అందించారు. మంత్రి కేటీఆర్‌ తో పాటు టీన్యూస్‌ ఎండీ సంతోష్ కుమార్‌ కు కూడా ఎంపీ కవిత రాఖి కట్టి రక్షాభందన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో కేటీఆర్ కుటుంబ సభ్యులతోపాటు కవిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

13903329_961343687310466_921771475114340466_n 14021522_961360823975419_5186795974490542298_n 14039900_185659411847501_3456180785876169268_n 14055029_961343643977137_636816610606933519_n

మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ పౌరులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. సోదర, సోదరీమణుల మధ్య శాశ్వతమైన బంధాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంపొందించేది రాఖీ పండుగన్నారు. ఏకత్వ స్ఫూర్తిని, సౌభ్రాతృత భావాలను బలోపేతం చేసే ఈ గొప్ప పండుగ సమాజంలో మహిళల రక్షణకు వారి సంక్షేమ వృద్ధికి బాటలు వేసేదిగా ఉండేలా ఈ రోజున మనమంతా సంకల్పం చెప్పుకోవాలన్నారు. దేశంలోని మహిళలు, అమ్మాయిలు అన్ని వేళలా సురక్షితంగా మనగలిగేలా మనమంతా ఈ పర్వదినాన సోదరభావాన్ని పెంపొందించుకుని వ్యాపింపజేయాలని పేర్కొన్నారు.

- Advertisement -