తెలుగు టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని అనుకున్నది సాధించాడు. సాకేత్ మైనేని, తన ప్రియురాలి మనసు గెలుచుకున్నాడు. స్పెయిన్ తో డేవిస్ కప్ ఆటలకు బయలుదేరే ముందు ఢిల్లీలో విందు ఏర్పాటు చేయగా, సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ తదితరులు చూస్తున్న వేళ, మోకాళ్లపై కూర్చుని తన ప్రియురాలు శ్రీలక్ష్మికి గులాబీ పువ్వును ఇస్తూ, తనను పెళ్లి చేసుకోమని ప్రతిపాదించాడు. నవ్వుతూ దాన్ని అందుకున్న శ్రీలక్ష్మి సిగ్గులొలుకుతూ సాకేత్ తో వివాహానికి అంగీకరించింది. దీంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా, కాబోయే జంట కేక్ ను కట్ చేసింది. ఇక తన సమక్షంలో ఇదే తొలి పెళ్లి ప్రపోజల్ అని లియాండర్ పేస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.
సోమవారం ప్రకటించిన తాజా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో సాకేత్ సింగిల్స్‌లో 137వ స్థానంలో నిలిచి కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు సాకేత్ మైనేని. లియాండర్ పేస్ 63వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
1st Marriage Proposal I have witnessed @DavisCup Congrats 2 d cute couple @sri0112 @SakethMyneni #loveall 👰🏻❤️👦🏽💍 pic.twitter.com/o35HNtFxsd
— Leander Paes OLY (@Leander) September 14, 2016