నగరానికి ఆక్సిజన్ అందించే హెచ్.సి.యు భూములను కాపాడాల్సిన భాధ్యత ప్రతి ఇక పౌరుడి పై ఉందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హెచ్.సి.యు భూములు, విద్యార్థుల పోరాటం పై మాట్లాడిన ఆయన.. హైదారాబాద్ నగరంలో గాలి కాలుష్యం అవుతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరిచ్చింది అన్నారు.
హైదారాబాద్ నగరానికి ఓ వైపు హెచ్.సి.యు. దగ్గర ఉన్న భూమి నుండి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది…ఇందిరా గాంధీ హయంలో యూనివర్సిటీకి భూమిని కేటాయించారు అన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అమ్ముతున్నారు.. హైదారాబాద్ నగరం బాగుండాలి అని కేసీఆర్ హరిత హారం చేపట్టి అనేక మొక్కలను నాటారు అన్నారు.
నేడు చెట్లుగా మారి నీడను, గాలిని ఇస్తున్నాయి.. హెచ్.సి.యు భూములను కాపాడేందుకు విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బిఆర్ఎస్ అండగా ఉంటుంది అని తెలిపారు.
Also Read:సమసిన హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్ వివాదం

