ఇది ఆంధ్రా ప్రజల విజయంః జగన్మోహన్ రెడ్డి

467
Jagan
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసిపి విజయ దుందుభి మోగిస్తోంది. ఏపీలో ఫ్యాన్ హై స్పీడ్ లో తిరుగుతుందని చెప్పుకోవాలి. ఫ్యాన్ గాలికి చంద్రబాబు సైకిల్ పంక్చర్ అయింది. ఏపీలో జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అటు లోక్ సభ ఇటు అసెంబ్లీ స్ధానాల్లో వైసిపి మెజార్టీ స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఈవిజయంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు వైయస్సార్ సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.

‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానికానికి.. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెప్పిన యావత్‌ రాష్ట్ర ప్రజలకు … హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’ అని ఫేస్‌బుక్‌పేజీలో పోస్ట్‌ చేశారు.

- Advertisement -