చంద్రబాబుకు భారీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్..

257
Chandrababu

ఎవరైనా ఏదైనా ఇస్తే మళ్ళీ తిరిగిచ్చెయ్యాలి లేకపోతే లావు అయిపోతారని శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగు బాగా పాపులర్ అయ్యింది. గత కొద్ది నెలల క్రితం ఇదే డైలాగును టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విషయంలో బాగానే వాడేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించాలని చూసి.. చాలానే కష్టపడ్డ చంద్రబాబు నాయుడుకు తాము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరతామని అప్పట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తమకు చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి.. తాము ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని కేసీఆర్ ప్రకటించాడు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కొన్ని నెలల క్రితం కేసీఆర్ చెప్పినట్లే రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబుకు ఇచ్చినట్లే తెలుస్తోంది.

Chandrababu

నేడు ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తీరు చూస్తుంటే కేసీఆర్‌ చెప్పిన డైలాగ్ నిజమనిపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుండే బాబు టీడీపీపై జగన్ వైసీపీ భారీ ఆధిక్యంలో వుంది. ఇదంతా చూస్తుంటే కేసీఆర్‌ చంద్రబాబును ఏపీ సీఎం కుర్చీ నుండి దించాలని కసిగా ఉన్నాట్లు కనిపిస్తోంది. మరి ఈ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అది స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కేసీఆర్ చెప్పినట్లుగా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లే అనిపిస్తోంది.