జగన్ ప్రమాణస్వీకారానికి సీఎం కేసీఆర్..

211
kcr jagan ap news

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైయస్సార్ సీపీ భారీ విజయాన్ని సాధించింది. ఇక జగన్ ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 25న శాసనసభాపక్ష సమావేశంలో జరుగనుంది. ఈసమావేశంలో జగన్ ను వైయస్ఆర్ఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు.

ఈనెల 30న జగన్ ప్రమాణస్వీకారానికి శారదా పీఠాధీపతి స్వరూపానందేంద్ర సరస్వతి ముహుర్తం పెట్టినట్టు తెలుస్తుంది. ఇక వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఛీప్ గెస్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ తో పాటు మరో 21రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.