తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్

159
jagantirumala

ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్. రేపు మధ్యాహ్నం ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయన నేడు తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. వైఎస్ జగన్‌కు టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో జగన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

మహాద్వారం గుండా ఆలయంలోనికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవచ్చని అధికారులు చెప్పినా.. భక్తులు వెళ్లే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ మార్గం ద్వారానే ఆయన లోపలికి వెళ్లారు. జగన్ వెంట టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్, ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, రోజా, సామినేని ఉదయభాను తదితరులు ఉన్నారు.