పవన్‌తో సినిమా చేయట్లేదు:బండ్ల గణేశ్

449
bandla ganesh pawan
- Advertisement -

పవన్‌తో తాను సినిమా చేయట్లేదని తెలిపారు నిర్మాత బండ్ల గణేశ్‌. పవన్‌తో బోయపాటి దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ నిర్మిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన గణేశ్‌ తన బ్యానర్‌లో ఏ సినిమా ఫైనలైజ్ కాలేదన్నారు. ఏదైనా సినిమా ఉంటే మొట్టమొదట అనౌన్స్ చేసేది తానేనని తెలిపారు.

ఏపీ ఎన్నికల్లో పవన్ సారథ్యంలోని జనసేన ఘెరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. పవన్ పోటీచేసినా గాజువాక,భీమవరం రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ మళ్లీ సినిమాలు తీస్తారని వార్తలు వెలువడుతున్నాయి.

పవన్ సన్నిహితుడు బండ్ల గణేష్‌ త్వరలో ఆయన సినిమా చేయబోతున్నారని దీనికి బోయపాటి దర్శకత్వం వహిస్తున్నారని పుకార్లు షికార్ చేస్తున్నాయి.ఈ సినిమా కోసం గణేష్‌ ఏకంగా పవన్‌కు రూ. 40 కోట్లు ఆఫర్ చేశారని వార్తలు వెలువడుతుండగా వాటిని ఖండించారు బండ్ల. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తీన్మార్‌,గబ్బర్ సింగ్ సినిమాలు వచ్చాయి. తీన్మార్ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించగా గబ్బర్‌ సింగ్ భారీ విజయాన్ని అందుకుంది.

- Advertisement -