హీరో రాజ్‌తరుణ్‌ తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష..

242
Young hero Raj Tarun’s father sentence to jail for three years
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌ తండ్రి నిదమర్తి బసవరాజుకు నకిలీ బంగారం కేసులో      మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ నిన్న (శుక్రవారం) కోర్టు తీర్పును వెలువరిచింది. బసవరాజు విశాఖపట్నంలోని వేపగుంటలో నివాసం ఉంటున్నారు. ఆయన ఎస్‌బీఐ బ్రాంచిలో 2013లో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్‌గా విధులు నిర్వహస్తున్న క్రమంలో   బసవరాజు భార్య రాజలక్ష్మితో పాటు అదే ప్రాంతానికి చెందిన ఎంఎస్ఎన్ రాజు, ఎన్. సన్యాసిరాజు, కె.సాంబమూర్తి, ఎన్.వెంకట్రావు            వంటి వారి పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.9.85లక్షల లోన్ తీసుకున్నారు.

 Young hero Raj Tarun’s father sentence to jail for three years

కొద్ది రోజుల అనంతరం బ్యాంకు అధికారులు తనిఖీలు నిర్వహించగా నకిలీ బంగారం వస్తువులు వెలుగుచూశాయి. ఈ నేపధ్యంలో బ్యాంకు మేనేజర్ అయిన సుబ్రహ్మణ్యం గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సీఐ నరసింహారావు దీనిపై నివేదికను కోర్టులో సమర్పించారు. కోర్టు విచారణ అనంతరం నిన్న (శుక్రవారం)     బసవరాజుకు మూడేళ్ల జైలు, రూ.20వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.

- Advertisement -