‘భరత్ అనే నేను’ సినిమాపై రాజమౌళీ కామెంట్స్..

542
SS Rajamouli reviews Bharat Ane Nenu, lauds Mahesh Babu’s performance
- Advertisement -

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’ ఈ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదలై విమర్శకుల ప్రసంశలందుకుంటోంది.       పూర్తి రాజకీయ నేపధ్యంలో తెరకెక్కి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా తగ్గదనేది సినిమా చూసిన వాళ్లు చెబుతున్న మాట.

 SS Rajamouli reviews Bharat Ane Nenu, lauds Mahesh Babu’s performanceబాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు రాజమౌళీ. ఈయన తాజాగా    ‘భరత్ అనే నేను’ సినిమా చూసి తనఅభిప్రాయాన్ని సోషల్ మీడియాద్వారా పంచుకున్నారు.ఒక కమర్షియల్ సినిమాలో లోకల్ గవర్నెన్స్ వంటి అంశాన్ని ప్రస్తావించడమనేది కొరటాల గొప్పతనం.

ముఖ్యంగా ఈ సినిమాలో ప్రెస్ కాన్ఫరెన్స్ సీన్ చాలా అద్భుతంగా ఉంది” అని ప్రశంసించారు.   మహేశ్ బాబు అద్భుతమైన నటనను కనబరిచాడు. మిగతా నటీనటులు వారి పాత్రలో ఒదిగిపోయారు. ఇంతమంచి సినిమాను అందించిన నిర్మాత డీవీవీ దానయ్య గారికి .. టీమ్ లోని ఇతర సభ్యులందరికీ అభినందనలు” అంటూ రాజమౌళీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -